Lucknow beat Rajasthan by 10 runs : ఈజీగా గెలిచే మ్యాచ్‌ను ఓడిన రాజస్థాన్.. లక్నోకు రాయల్స్‌పై తొలి విక్టరీ
ఐపీఎల్-లో2023 బుధవారం 26వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ నాలుగు సంవత్సరాల ఈ గ్రౌండ్‌లో జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్-లో2023 బుధవారం 26వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals ), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium)లో ఈ మ్యాచ్ జరిగింది. ఐపీఎల్(IPL) మ్యాచ్ నాలుగు సంవత్సరాల ఈ గ్రౌండ్‌లో జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాజస్థాన్(Rajasthan), లక్నో(Lucknow) రెండు జట్లు ఇప్పటివరకు సీజన్‌లో ఆరింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని తేలింది. ఫలితంగా హోంగ్రౌండ్‌లో రెండో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కైల్ మైయర్స్ 51 పరుగులు టాప్ స్కోరర్. కైల్ మైయర్స్ కు ఈ సీజన్‌లో ఇది మూడవ అర్ధ సెంచరీ. రాజస్థాన్ తరఫున అశ్విన్(Ashwin) 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్(Trent Boult) 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్(Jos Buttler), యశస్వి జైస్వాల్(Yasashwi Jaiswal) లు తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత ఆ జట్టు మిగిలిన 51 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. బట్లర్ ఇచ్చిన రాంగ్ కాల్‌తో కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) రనౌట్ అయ్యాడు. అతని వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో, రాజస్థాన్‌లు 8-8 పాయింట్లతో ఉన్నాయి. అయితే పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ జట్టు అగ్రస్థానంలో ఉంది.
అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్ 2022లో లక్నో జట్టు అరంగేట్రం చేసింది. సంజూ శాంసన్ జట్టు ఆ సీజన్‌లో రెండు సార్లు కేఎల్ రాహుల్(KL Rahul) జట్టును ఓడించింది. లక్నో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో తొలిసారి రాహుల్ సేన రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. అవేష్ ఖాన్(Avesh Khan) 4 ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.