ఐపీఎల్-2023లో 38వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

ఐపీఎల్-2023లో 38వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్‌(Lucknow Super Giants) జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. మొహాలీలోని ఐఎస్ బింద్రా(IS Bindra Stadium) స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్(Shikar Dhawan) ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఛేద‌న‌లో పంజాబ్ జట్టు 19.5 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. దీంతో లక్నో సూపర్ జెయింట్ పంజాబ్ కింగ్స్‌ను 56 పరుగుల తేడాతో ఓడించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) 40 బంతుల్లో 72 పరుగులు, కైల్ మేయర్స్(Kyle Mayers) 24 బంతుల్లో 54 పరుగులు చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. అథర్వ తైడ(Atharwa Taide) 36 బంతుల్లో 66 పరుగులు చేశాడు. పంజాబ్ జ‌ట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 40+ పరుగులు చేయలేకపోయాడు. ల‌క్నో జ‌ట్టులో యశ్ ఠాకూర్(Yash Thakur) నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హక్(Naveen ul Hak) మూడు వికెట్లు తీశారు.

ఈ విజయంతో లక్నో(Lucknow) ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ తర్వాత ఆ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. ఎనిమిదో మ్యాచ్‌లు ఆడిన‌ పంజాబ్‌(Punjab)కు ఇది నాలుగో ఓటమి. ఆ జట్టు నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers)తో మే 1న ఎకానా స్టేడియంలో ఆడనుంది. పంజాబ్ చెపాక్‌లో ఏప్రిల్ 30న చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో ఆడాల్సి ఉంది.

Updated On 28 April 2023 9:17 PM GMT
Yagnik

Yagnik

Next Story