భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, అతని భార్య పంఖురి శర్మ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఈ జంట త‌మ బిడ్డ‌కు వాయు అని పేరు పెట్టారు

భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, అతని భార్య పంఖురి శర్మ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఈ జంట త‌మ బిడ్డ‌కు వాయు అని పేరు పెట్టారు. కృనాల్ తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కృనాల్, పంఖురి జూలై 2022లో తమ మొదటి బిడ్డ కవిర్‌కి స్వాగతం పలికారు. కృనాల్ పాండ్యా తన పోస్ట్‌లో వాయు ఏప్రిల్ 21, 2024 న జన్మించాడు. క్రికెట‌ర్లు దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ లు.. కృనాల్‌కు దంపతులకు బిడ్డ పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఏప్రిల్ 23న చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నైతో మ్యాచ్‌లో ఆడిన‌ కృనాల్ పాండ్యా.. తన రెండవ బిడ్డ పుట్టిన 2 రోజుల తర్వాత లక్నోకు తిరిగి వచ్చాడు. లక్నో ఫ్రాంచైజీ కూడా కృనాల్ పాండ్యాకు రెండో బిడ్డ పుట్టినందుకు అభినందనలు తెలిపింది.

కృనాల్ పాండ్యా 2017లో తన చిరకాల స్నేహితురాలు మోడల్ పంఖురి శర్మను వివాహం చేసుకున్నాడు. క్రికెటర్‌గా తన ప్రయాణంలో పంఖురి ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచింద‌ని ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తరచుగా చెబుతూ ఉంటాడు. కృనాల్, అతని తమ్ముడు హార్దిక్ అన్ని ప్రధాన పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో వారి కుటుంబాలతో కలిసి కనిపిస్తారు.

Updated On 26 April 2024 9:45 PM GMT
Yagnik

Yagnik

Next Story