నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన‌ ఢిల్లీ 213 పరుగులు చేసింది.

నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(Punkab Kings)పై ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్(Punjab) జట్టు దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన‌ ఢిల్లీ(Delhi) 213 పరుగులు చేసింది. సమాధానంగా పంజాబ్ జట్టు 198 పరుగులు మాత్ర‌మే చేసింది. ఢిల్లీ తరఫున రిలే రస్సో(Rilee Rossouw)అజేయంగా 82 పరుగులు చేశాడు. అతనితో పాటు పృథ్వీ షా(Prithwi Shah) కూడా 54 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ వార్నర్(David Warner) (46), ఫిలిప్ సాల్ట్(Philip Salt) (26) కూడా ప‌ర్వాలేద‌నిపించారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్(Sam Curran) రెండు వికెట్లు తీశాడు. పంజాబ్ తరఫున లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone) అత్యధికంగా 94 పరుగులు చేశాడు. అథర్వ టైడే(Atharva Taide) 55 పరుగులు చేసి రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ తరఫున నోకియా, ఇషాంత్ శ‌ర్మ‌(Ishanth Sharma) చెరో రెండు వికెట్లు తీశారు.

Updated On 17 May 2023 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story