కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో(Badminton tournament) కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్(common wealth champion) లక్ష్య సేన్(Lakshya Sen) జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై(Kenta Nishimoto) వరుస గేమ్‌లతో విజయం సాధించి ఫైనల్లోకి(Finals) దూసుకెళ్లాడు. లక్ష్య సేన్ 11వ ర్యాంక్ కెంటా నిషిమోటోను 21-17, 21-14 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు.

కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో(Badminton tournament) కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్(common wealth champion) లక్ష్య సేన్(Lakshya Sen) జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై(Kenta Nishimoto) వరుస గేమ్‌లతో విజయం సాధించి ఫైనల్లోకి(Finals) దూసుకెళ్లాడు. లక్ష్య సేన్ 11వ ర్యాంక్ కెంటా నిషిమోటోను 21-17, 21-14 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి(Akane Yamaguchi) సెమీఫైనల్లో భారత్‌కు చెందిన ప్రపంచ 15వ ర్యాంకర్ పీవీ సింధును(PV sindhu) మట్టికరిపించింది.

సీజన్ ప్రారంభంలో లక్ష్య సేన్ ఫామ్‌లో లేక‌ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానానికి పడిపోయాడు. 21 ఏళ్ల లక్ష్య సేన్.. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. లక్ష్య సేన్ ఫైనల్‌లో చైనాకు చెందిన లి షి ఫెంగ్‌తో తలపడనున్నాడు. వీరిరువురికి 4-2 హెడ్-టు-హెడ్ రికార్డు ఉంది.

మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది. సింధుపై యమగూచి 11వ విజయాన్ని నమోదు చేసింది. గ‌తంలో యమగూచిపై భారత షట్లర్ పీవీ సింధు 14 మ్యాచ్‌లు గెలిచిన రికార్డ్ ఉంది.

2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సింధు గాయపడింది. త‌ర్వాత కోలుకుని బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టిన సింధూ ఫామ్ ఆందోళనకరంగా మారింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ నుండి తొమ్మిది టోర్నమెంట్లు ఆడిన సింధూ.. ఐదు టోర్నమెంట్లలో మొదటి రౌండ్లోనే ఓడిపోయి నిష్క్రమించింది. సింధు ఈ ఏడాది మొత్తం 26 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 14 మ్యాచ్‌ల‌లో గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల‌లో ఓడిపోయింది. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం సింధు ఎదురుచూస్తోంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన‌ సింధు గాయం నుంచి కోలుకున్నాక‌ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతోంది.

Updated On 9 July 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story