కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ అద్భుత స్పిన్ తో చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) సెంచరీ, కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) అద్భుత స్పిన్ తో చివరి టీ20 మ్యాచ్‌లో భారత్(India) 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా(South Africa)ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు విదేశాల్లో భారత్‌కు ఇదే చివరి టీ20 మ్యాచ్ కావ‌డం విశేషం. దక్షిణాఫ్రికాపై భారత్ పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

T-20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన‌ రోహిత్ శర్మ(Rohit Sharma), గ్లెన్ మాక్స్‌వెల్‌(Glenn Maxwell)ల రికార్డును సూర్యకుమార్ యాద‌వ్ సమం చేశాడు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు తలా నాలుగు సెంచరీలు చేశారు.ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సూర్యకుమార్‌తో పాటు యశస్వి జైవాల్(Yashaswi Jaishwal) (60) కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. యశస్వి, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 70 బంతుల్లో 112 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ బంతుల్ని ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా తరఫున డేవిడ్ మిల్లర్(David Miller) (35) అత్యధిక పరుగులు చేశాడు. కుల్దీప్‌తో పాటు జడేజా(Jadeja) (2/25) కూడా వికెట్లు తీశాడు. డేవిడ్ మిల్లర్(35) మిన‌హా మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ క్రీజులో నిల‌దొక్కుకోలేపోయారు.

అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ దక్షిణాఫ్రికా నుంచి అరంగేట్రం చేశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, ఆల్‌రౌండర్‌ డోనోవన్‌ ఫెరీరాకు జ‌ట్టులో చోటు దక్కింది. టీమిండియా ప్లేయింగ్‌-11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా డిసెంబ‌ర్ 17 నుంచి వ‌న్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

Updated On 14 Dec 2023 8:49 PM GMT
Yagnik

Yagnik

Next Story