IND Vs SL Asia Cup : లో స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విక్టరీ.. ఆసియా కప్ ఫైనల్‌కు టీమిండియా
ఆసియా కప్ సూపర్-4 రౌండ్‌లో భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో శ్రీలంక, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్ తలపడనుంది.
ఆసియా కప్(Asia Cup) సూపర్-4 రౌండ్‌లో భారత జట్టు(Team India) తన రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka)ను ఓడించింది. దీంతో టీమిండియా ఫైనల్(Final)కు చేరుకుంది. దీంతో శ్రీలంక, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్ తలపడనుంది. అయితే దీనికి ముందు బంగ్లాదేశ్(Bangladesh)తో టీమ్ ఇండియా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు 172 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అత్యధికంగా 53 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్(KL Rahul) 39 పరుగులు, ఇషాన్ కిషన్(Ishan Kishan) 33 పరుగులు చేశారు.
శ్రీలంక తరఫున దునిత్ వెలలాగే ఐదు వికెట్లు, చరిత్ అసలంక నాలుగు వికెట్లు తీశారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో దునిత్ వెలలాగే అత్యధికంగా 42* పరుగులు చేశాడు. ధనంజయ్ డిసిల్వా 41 పరుగులు చేశాడు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్(Kulddep Yadav) నాలుగు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bhumra), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక(Srilanka), పాకిస్థాన్(Pakistan)ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్ ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ జట్టు ఫైనల్ రేసులో లేదు.