క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తూ యువకుడు పడిపోయాడు. పక్కనే నిలబడిన స్నేహితులు పరుగున వచ్చి యువకుడిని పైకి లేపినా ఆ యువకుడి శరీరంలో ఎలాంటి చలనం లేదు.

క్రికెట్(Cricket) ఆడుతూ బౌలింగ్ చేస్తూ యువకుడు పడిపోయాడు. పక్కనే నిలబడిన స్నేహితులు పరుగున వచ్చి యువకుడిని పైకి లేపినా ఆ యువకుడి శరీరంలో ఎలాంటి చలనం లేదు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బౌలింగ్ చేస్తున్న‌ సమయంలో గుండె ఆగిపోవడంతో యువ‌కుడు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. షామ్లీ నగరంలోని మొహల్లా వివేక్‌ విహార్‌లో నివాసం ఉంటున్న బులియన్‌ వ్యాపారి సుఖ్‌మల్‌ వర్మ కుమారుడు 26 ఏళ్ల కుల్‌దీప్‌ వర్మ(Kuldeep Varma) శనివారం ఉదయం 8 గంటలకు మజ్రా రోడ్డులోని వీవీ పీజీ కళాశాల మైదానంలో ఇతర యువకులతో కలిసి క్రికెట్‌(Cricket) ఆడేందుకు వెళ్లాడు. బంతి విసరడానికి పరిగెత్తిన కుల్దీప్ మైదానంలో ఒక్క‌సారిగా కుప్ప‌కూలాడు. స్నేహితులు అతడిని కదిలించే ప్ర‌య‌త్నం చేశారు. నీళ్ళు అతని ముఖం మీద చిలకరించినా.. ఎటువంటి చలనం లేదు.

దీంతో అత‌డి కుటుంబ స‌భ్‌యుల‌కు సమాచారం అందించగా కుల్‌దీప్ ను గంగా అమృత్‌ ఆస్పత్రి(Ganga Amruth Hospital)కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె ఆగిపోవడంతో యువకుడు మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. కుల్‌దీప్‌ ముగ్గురు సోదరీమణులకు ఏకైక సోదరుడు. అతనికి మూడేళ్ల క్రితం పెళ్లయింది. అత‌డికి 13 నెలల కూతురు కూడా ఉంది.

8.30 గంటల ప్రాంతంలో కుల్‌దీప్‌ మైదానానికి చేరుకున్నాడని యువకుడి స్నేహితులు తెలిపారు. తొమ్మిది గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా బౌలింగ్ చేసేందుకు కుల్దీప్ బృందం వచ్చింది. అతను మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. రెండు బంతులు సరిగ్గా బౌలింగ్ చేసాడు. మూడవ బంతిని విసిరేందుకు పరిగెత్తుతున్న స‌మ‌యంలో అతడు క్రీజుకు కొద్ది దూరంలో పడిపోయాడు. తోలి క్రీడాకారులు అత‌డి ద‌గ్గ‌రికి వ‌చ్చేలోపే అత‌డు అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వెంట‌నే అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Updated On 27 Jan 2024 9:38 PM GMT
Yagnik

Yagnik

Next Story