ఐపీఎల్‌-2023లో 18వ మ్యాచ్ శుక్ర‌వారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జ‌ట్ల మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens)లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ నేప‌థ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు ముందు కోల్‌కతా పిచ్(Pitch), రెండు జట్ల హెడ్ టు హెడ్(Head to Head) గణాంకాలను […]

ఐపీఎల్‌-2023లో 18వ మ్యాచ్ శుక్ర‌వారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జ‌ట్ల మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens)లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ నేప‌థ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు ముందు కోల్‌కతా పిచ్(Pitch), రెండు జట్ల హెడ్ టు హెడ్(Head to Head) గణాంకాలను చూద్దాం.

పిచ్ రిపోర్ట్‌ :

ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్‌లో స్పిన్నర్లు(Spinners) ఆధిప‌త్యం వ‌హిస్తారు. ఈడెన్ గార్డెన్స్ లో స్పిన్నర్లు బౌలింగ్‌ను ఆస్వాదించారు. ఈ రోజు ఇరు జట్లు స్పిన్ బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు.

హెడ్ ​​టు హెడ్ గణాంకాలు :

కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య ఇప్పటివరకు మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేకేఆర్‌ 15 విజయాలతో సన్‌రైజర్స్ కంటే ముందుంది. సన్‌రైజర్స్ 8 విజయాలు మాత్రమే సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు ఎనిమిదిసార్లు త‌ల‌ప‌డ్డాయి. కేకేఆర్ 6-2 ఆధిక్యంలో ఉంది. 2020 సంవత్సరం నుంచి ఈ మైదానంలో కేకేఆర్‌తో జ‌రిగిన‌ ఒక్క మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలవలేకపోయింది.

T20 మ్యాచ్‌లలో ఈడెన్ గార్డెన్స్ గణాంకాలు

ఆడిన మొత్తం మ్యాచ్‌లు : 12
మొదట బ్యాటింగ్‌లో గెలిచిన మ్యాచ్‌లు: 5
ముందుగా బౌలింగ్‌లో గెలిచిన మ్యాచ్‌లు: 7
తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు: 155 పరుగులు
రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు: 137 పరుగులు
అత్యధిక మొత్తం: 201/5 (20 ఓవర్లు) పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ నమోదు.
అత్యల్ప మొత్తం స్కోరు: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ నమోదు చేసిన 70/10 (15.4 ఓవర్లు).

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం లైవ్ యాక్షన్ రాత్రి 7.30 నుండి ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా మీరు టీవీలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జియో సినిమా ద్వారా 12 భాషలలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.

Updated On 14 April 2023 1:29 AM GMT
Yagnik

Yagnik

Next Story