ఐపీఎల్‌-2023లో భాగంగా గురువారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు(RCB) కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 81 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంత‌రం చేధ‌న‌కు దిగిన‌ ఆర్‌సీబీ జట్టు 123 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్‌ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆర్‌సీబీ త‌మ మొద‌టి […]

ఐపీఎల్‌-2023లో భాగంగా గురువారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు(RCB) కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 81 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంత‌రం చేధ‌న‌కు దిగిన‌ ఆర్‌సీబీ జట్టు 123 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్‌ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆర్‌సీబీ త‌మ మొద‌టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ మ్యాచ్‌లో 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆర్సీబీ(Royal Challengers Bangalore) బ్యాటింగ్ పూర్తిగా విఫ‌ల‌మైంది. తొలుత విరాట్ కోహ్లీ కేవలం 21 పరుగులకే అవుటయ్యాడు. కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా అతని వెంటే 23 పరుగుల చేసి పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత‌ గ్లెన్ మాక్స్‌వెల్, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్ పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. చివర్లో డేవిడ్ విల్లీ 22 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. బౌల‌ర్‌ ఆకాష్‌దీప్ 17 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 123 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ సుయాష్ శర్మ 3 వికెట్లతో ఆక‌ట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు(Kolkata Knight Riders) 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ కూడా పేలవంగా ఉంది. తొలుత‌ 89 పరుగులకే కేకేఆర్‌ 5 వికెట్లను కోల్పోయింది. అనంత‌రం శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) అద్భుతంగా బ్యాట్‌తో రాణించి 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ సింగ్ అతనికి మద్దతుగా నిలిచాడు. రింకూ 46 పరుగులు చేశాడు. అంత‌కుముందు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఇన్నింగ్స్ 57 పరుగులు చేశాడు.

కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ మ్యాచ్‌లలో ఇప్ప‌టివ‌ర‌కూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పైచేయి సాధించింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో 16 కేకేఆర్ టీమ్ గెలవగా..14 ఆర్సీబీ టీమ్ గెలిచింది. నిన్న ఇరు జట్లు తమ 31వ ఐపీఎల్(IPL-2023) మ్యాచ్‌లో తలపడ్డాయి.

Updated On 6 April 2023 9:16 PM GMT
Yagnik

Yagnik

Next Story