ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సాగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఓవర్లోనే సన్ రైజర్స్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ట్రెవిస్ హెడ్ డకౌట్ గా వెనుదిరిగాడు. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగి స్పిన్ తిప్పేసిన షాబాజ్ అహ్మద్ ను సన్ రైజర్స్ తుది జట్టులోకి తీసుకుంది. అబ్దుల్ సమద్ ను జట్టు నుంచి తప్పించారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్ క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, టి.నటరాజన్.

కోల్ కతా నైట్ రైడర్స్:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్లు:
అనుకూల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాయిన్ రూథర్ ఫర్డ్.

Updated On 26 May 2024 8:47 AM GMT
Yagnik

Yagnik

Next Story