కేవలం ఒకే ఒక్క పరుగుతో ఆర్సీబీ ఓటమి పాలైంది. కోల్ కతాలోని

ఈ సీజన్ లో ఆర్సీబీకి ఏ మాత్రం కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్ లు కూడా ఓడిపోతూ ఉన్నారు. అలాంటి మ్యాచ్ ఈ ఆదివారం జరిగింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో ఆర్సీబీ ఓటమి పాలైంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ లో బెంగళూరు జట్టు కేవలం 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది.

223 పరుగుల లక్ష్యఛేదనలో చివరి ఓవర్ లో బెంగళూరు జట్టుకు 21 పరుగులు అవసరం కాగా మిచెల్ స్టార్క్ విసిరిన ఆ ఓవర్లో కర్ణ్ శర్మ ఏకంగా మూడు సిక్స్ లు బాది బెంగళూరు విజయంపై ఆశలు చిగురింపజేశాడు. 2 బంతుల్లో 3 పరుగులు చేస్తే గెలుస్తారనగా కర్ణ్ శర్మ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమవ్వగా.. బెంగళూరు జట్టు చివరి బ్యాట్స్ మన్ లాకీ ఫెర్గుసన్ రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో విజయం కోల్ కతాను వరించింది.

లక్ష్యఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్ లో కోహ్లీ 18, కెప్టెన్ డుప్లెసిస్ 7 పరుగులు చేశారు. విల్ జాక్స్, రజత్ పాటిదార్ జోడీ అద్భుతంగా ఆడి బెంగళూరు స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లింది. విల్ జాక్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేయగా... రజత్ పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సుయాష్ ప్రభుదేశాయ్ 25, దినేశ్ కార్తీక్ 25 పరుగులు చేశారు. కర్ణ్ శర్మ 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 2, మిచెల్ స్టార్క్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించింది. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. సాల్ట్ 7 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. వెంకటేశ్ అయ్యర్ 16 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 50 పరుగులు, రింకూ సింగ్ 24 పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్ 27 పరుగులు చేయగా, రమణ్ దీప్ సింగ్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ 2, కామెరాన్ గ్రీన్ 2, మహ్మద్ సిరాజ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.

Updated On 21 April 2024 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story