కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో సూపర్‌ జెయింట్‌ ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా అవతరించింది. ఈ ఓటమితో కోల్‌కతా జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)పై లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో సూపర్‌ జెయింట్‌ ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా అవతరించింది. ఈ ఓటమితో కోల్‌కతా(Kolkata) జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో(Lucknow) 176 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన‌ కోల్‌కతా జట్టు 175 పరుగులుమాత్ర‌మే చేసి ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఎనిమిది వికెట్లకు 176 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కోల్‌కతా జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. ఒక పరుగు తేడాతో కోల్‌క‌తా ఓడిపోయింది. లక్నో తరఫున నికోలస్ పూరన్(Nicholas Pooran) అత్యధికంగా 58 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌల‌ర్ల‌లో వైభవ్ అరోరా(Vaibhav Arora), శార్దూల్ ఠాకూర్(Shardhul Thakur), సునీల్ నరైన్(Sunil Narine) త‌లా రెండు వికెట్లు తీశారు. కోల్‌కతా తరఫున రింకూ సింగ్(Rinku Singh) అత్యధికంగా 67 పరుగులు చేశాడు. లక్నో తరఫున రవి బిష్ణోయ్(Ravi Bishnoi), యశ్ ఠాకూర్(Yash Thakur) చెరో రెండు వికెట్లు తీశారు.

ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా అవతరించింది. ప్ర‌స్తుతం ప్లేఆఫ్స్‌లో ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉంది. దీని కోసం ముంబై(Mumbai Indians), బెంగళూరు(Royal Challengers Banglore) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ రెండు జట్లూ తమ చివరి మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోతే,.. రాజస్థాన్(Rajasthan) జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.

Updated On 21 May 2023 12:34 AM GMT
Yagnik

Yagnik

Next Story