Kolkata Knight Riders vs Delhi Capitals : రెచ్చిపోయిన సాల్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్‌లో 47వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కేకేఆర్ జట్టు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది.

Kolkata Knight Riders vs Delhi Capitals Match Update
ఐపీఎల్ 17వ సీజన్‌లో 47వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కేకేఆర్ జట్టు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది.. ఇందులో KKR జట్టు గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు తొలుత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో కుల్‌దీప్ యాదవ్(35), పంత్(27) మాత్రమే పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా రెండేసి వికెట్ల చొప్పున తీసి ఢిల్లీ నడ్డి విరిచారు.
అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. కేకేఆర్ జట్టులో ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సునీల్ నరైన్ కూడా 15 పరుగులు చేశాడు, రింకూ సింగ్ 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది ఆరో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
