ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో RCB జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా KKR కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని సాధించి ఈ సీజన్‌లో రెండవ విజయాన్ని నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ 83 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా 182 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదన‌లో KKR ఓపెనింగ్ జోడీ ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ జట్టుకు ఘ‌న‌మైన‌ ప్రారంభాన్ని అందించారు. సాల్ట్ 30 పరుగులు చేయ‌గా.. సునీల్‌ నారాయణ్ 47 పరుగులు చేశాడు. అనంత‌రం వెంకటేష్ అయ్యర్ 50 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పిచ్‌లో ఉన్న డబుల్ బౌన్స్ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌ నుంచి బంతి బ్యాట్‌ కాస్త ఆలస్యంగా వచ్చింద‌ని.. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మెరుగ్గా మారిందని.. దీంతో పరుగులు చేయడం సులభమైందని ఫాఫ్ చెప్పాడు.

మా బ్యాటింగ్ సమయంలో పిచ్ ప్రవర్తన కారణంగా విరాట్ కోహ్లీ కూడా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఇక్క‌డ‌ పరుగులు చేయడం అంత సులభం కాదు. వేగంగా పరుగులు చేయడం అంత సులభం కాని పరిస్థితుల్లో KKR బౌలర్లు మాకు వ్యతిరేకంగా కట్టర్లు, బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతులను ఎక్కువగా ఉపయోగించారని పేర్కొన్నారు.

Updated On 29 March 2024 11:33 PM GMT
Yagnik

Yagnik

Next Story