Punjab Kings vs Royal Challengers Bangalore : నిప్పులు చెరిగిన సిరాజ్.. పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ ఘనవిజయం
ఐపీఎల్-2023లో 27వ మ్యాచ్ మొహాలీలోని పీసీఏ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఇరు జట్లకు ఇది ఆరో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఐపీఎల్-2023లో 27వ మ్యాచ్ మొహాలీలోని పీసీఏ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య జరిగింది. ఇరు జట్లకు ఇది ఆరో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ(RCB) 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు సామ్ కరణ్ సారథ్యం వహించగా.. ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్‌గా ఉన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ డు ప్లెసిస్(Faf Du Plessis) ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇన్నింగ్స్ 84 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ 16.1 ఓవర్లలో 137 పరుగులు జోడించారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఆ తర్వాత చివరి 23 బంతుల్లో ఆర్సీబీ 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి 20 ఓవర్లలో జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో డు ప్లెసిస్ 84, విరాట్ 59 పరుగులు చేశారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్సు పేలవంగా ప్రారంభమైంది. 3.2 ఓవర్లలో 27 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొదటి 10 ఓవర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(Prabsimran Singh) (46) ఒక్కడే పోరాడాడు. దీంతో చివర్లో జితేష్ శర్మ(Jithesh Sharma) 27 బంతుల్లో 41 పరుగులతో పంజాబ్ కు ఆశలు రేకెత్తించాడు. కానీ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) బౌలింగ్ ముందు పంజాబ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోయారు. సిరాజ్ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. వాణిందు హసరంగ(Hasaranga) 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.