చెన్నైలో తన క్లాస్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు కేఎల్ రాహుల్. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 97 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీతో కలిసి రాహుల్ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చెన్నై(Chennai)లో తన క్లాస్ బ్యాటింగ్‌(Bating)తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు కేఎల్ రాహుల్(KL Rahul). ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 97 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(Virat Kohli)తో కలిసి రాహుల్ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. త‌ద్వారా 2023 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి విజయాన్ని అందించాడు. పాట్ కమిన్స్(Pat Cummins) వేసిన బంతిని సిక్సర్ కొట్టి రాహుల్ భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. అయితే.. సిక్స్ కొట్టిన తర్వాత రాహుల్ ఎక్స్‌ప్రెష‌న్ వైర‌ల్‌గా మారింది.

కేఎల్ రాహుల్ 42వ ఓవర్ రెండో బంతికి ప్యాట్ కమిన్స్‌పై కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్సర్(Six) కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. సిక్స్ కొట్టిన రాహుల్ ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయి బ్యాట్ పట్టుకుని కూర్చున్నాడు. కొన్ని సెక‌న్ల‌ తర్వాత రాహుల్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. రాహుల్ ను చూస్తుంటే.. ఫోర్ ఆశిస్తున్నట్లు అనిపించినా.. బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది. రాహుల్ ఈ రియాక్షన్(Reaction) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చేసరికి భారత జట్టు కేవలం 2 పరుగులకే మూడు భారీ వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరంభంలో నిదానంగా బ్యాటింగ్ చేసిన రాహుల్.. క్రీజులో స్థిరపడిన తర్వాత షాట్‌లను ఆడాడు. రాహుల్ 115 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Updated On 8 Oct 2023 8:41 PM GMT
Yagnik

Yagnik

Next Story