ఐపీఎల్ 2023లో భాగంగా జ‌రిగిన‌ 61వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో త‌ల‌ప‌డిన‌ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా కోల్‌కతా ప్లేఆఫ్‌పై ఉన్న‌ చివరి ఆశను నిలుపుకుంది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లో నిల‌వ‌డం కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్లేఆఫ్‌కు అర్హత సాధించక‌పోవ‌డం విశేషం. మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2023లో భాగంగా జ‌రిగిన‌ 61వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)తో త‌ల‌ప‌డిన‌ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా కోల్‌కతా(Kolkata) ప్లేఆఫ్‌(Playoff)పై ఉన్న‌ చివరి ఆశను నిలుపుకుంది. అదే సమయంలో చెన్నై(Chennai) సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లో నిల‌వ‌డం కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్లేఆఫ్‌కు అర్హత సాధించక‌పోవ‌డం విశేషం. మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బ‌దులుగా కేకేఆర్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. కేకేఆర్ విజ‌యంలో బౌలర్లు కీల‌క‌పాత్ర పోషించ‌గా.. బ్యాట్స్‌మెన్‌లు కెప్టెన్ నితీష్ రాణా(Nitish Rana), రింకూ సింగ్‌(Rinku Singh)లు స‌రైన స‌మయంలో జ‌ట్టుకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇద్దరూ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడారు. నాల్గవ వికెట్‌కు ముఖ్యమైన 99 పరుగుల భాగస్వామ్యాన్ని న‌మోదు చేశారు. ఓపెన‌ర్లు జాస‌న్ రాయ్‌(Jason Roy), గుర్భాజ్‌, వెంక‌టేష్ అయ్య‌ర్(Venkatesh Iyer) త‌క్కువ ప‌రుగుల‌కే వెనుదిర‌గ‌డంతో.. నితీష్ రాణా, రింకూ సింగ్ ఇన్నింగ్సు నిర్మించారు.

చెన్నై జ‌ట్టులో ఓపెనింగ్‌కు వ‌చ్చిన‌ రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 13 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ కాన్వాయ్(Devon Conway) 28 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అనంత‌రం రహానే(Ajinkya Rahane) 16, రాయుడు(Ambati Rudu) 4 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులు చేసి స్కోరును 140 ప‌రుగుల‌కు తీసుకెళ్లాడు. రవీంద్ర జడేజా స్లో ఇన్నింగ్స్ ఆడినా 20 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ నరైన్ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, వైభవ్‌ అరోరా ఒక్కో వికెట్ తీశారు.

Updated On 14 May 2023 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story