West Indies vs India : చివరి టీ20లో ఓటమి.. సిరీస్ కోల్పోయిన టీమిండియా
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరిగింది. తొలి రెండు టీ20ల్లో ఓటమి తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసిన భారత జట్టు మూడు, నాలుగో మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

King finishes off with a 6, WI clinch 1st T20I bilateral series win over IND since 2016
భారత్(India), వెస్టిండీస్(West Indies) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరిగింది. తొలి రెండు టీ20ల్లో ఓటమి తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసిన భారత జట్టు మూడు, నాలుగో మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే ఐదో టీ20లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమ్ ఇండియా 2-3తో సిరీస్‌ను కూడా కోల్పోయింది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐదో, చివరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఐదో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 61, తిలక్ వర్మ(Tilak Varma) 27 పర్వాలేదనిపించారు. షెపర్డ్(Romario Shepherd) నాలుగు వికెట్లు, హోల్డర్(Holder), హొసెన్(Hosein) తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం వెస్టిండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్రాండన్ కింగ్(Brandon King)55 బంతుల్లో 85, నికోలస్ పూరన్(Nicholas Pooran) 35 బంతుల్లో 47 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్(Arshadeep Singh), తిలక్ వర్మ తలా ఒక వికెట్ చొప్పున తీశారు. రొమారియో షెపర్డ్ కుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player of The Match), నికోలస్ పూరన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(Player Of The Series) గా నిలిచారు.
