భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా చరిత్ర సృష్టించారు. అతి పిన్న వయసులో ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికై అరుదైన ఘ‌న‌త సాధించారు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా చరిత్ర సృష్టించారు. అతి పిన్న వయసులో ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికై అరుదైన ఘ‌న‌త సాధించారు. గ్రెగ్ బార్ల్కే స్థానంలో జే షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. గ్రెగ్ బార్ల్కే మూడవసారి ప‌ద‌విలో కొన‌సాగేందుకు నిరాకరించారు. దీంతో కొత్త ఛైర్మన్‌గా జే షా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం జై షా వయసు 36 ఏళ్లు. ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 5వ భారతీయుడు జై షా. గతంలో జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా ఉన్నారు. జగ్మోహన్ దాల్మియా 1997లో మొదటి ఆసియా ICC అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శరద్ పవార్ 2010 నుంచి 2012 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ఎన్ శ్రీనివాసన్ ఐసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2014 నుంచి 2015 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఐసీసీ తదుపరి స్వతంత్ర ఛైర్మన్‌గా జే షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా అక్టోబర్ 2019 నుండి BCCI గౌరవ కార్యదర్శిగా, జనవరి 2021 నుండి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. జే షా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి జే షా మాత్రమే కావ‌డం విశేషం.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story