రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు క్రీడాకారులు గైర్హాజరవడంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందించారు

రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు క్రీడాకారులు గైర్హాజరవడంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందించారు. ఇది పెద్ద సమస్యేనని.. రంజీ టోర్నమెంట్లో ఆడని ప్లేయర్లకు లేఖ రాస్తానని అన్నారు. దేశవాళీ మ్యాచులకు జట్టు సభ్యులు గైర్హాజరవడం పెద్ద సమస్యేనని షా అన్నారు. కెప్టెన్ లేదా కోచ్ క్రీడాకారులను రంజీలో ఆడమన్నప్పుడు ప్లేయర్స్ ఆ టోర్నీలో పాల్గొనాలని తెలిపారు. జాతీయ క్రికెట్ అకాడమీలో లేని వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. గాయాలపాలైన ప్లేయర్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. రెడ్ బాల్ టోర్నీలో పాల్గొని గాయాలు ముదిరేలా చేసుకోకూడదు. వైట్ బాల్ టోర్నీ ఛాన్సులు తగ్గకూడదన్నారు. దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లకూ ఎంపికకాలేదు. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు అతడు కొంత దేశవాళీ క్రికెట్ ఆడాలని కోచ్ ద్రావిడ్ సూచించారు.

ఇక టీమిండియాలో లేని ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడాలంటే కొన్ని రంజీ మ్యాచ్ ల్లో ఆడాలని బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతోంది. రంజీల్లో తమ రాష్ట్ర జట్లకు ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టిన ఇషాన్ కిషన్, దీపక్ చహర్, కృనాల్ పాండ్యా వంటి కొందరు ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు మాత్రం మినహాయింపు ఇచ్చారని తెలిస్తోంది.
హార్దిక్ పాండ్యా నాలుగు రోజులు, ఐదు రోజుల క్రికెట్ ఫార్మాట్లలో ఆడలేడు. అతడి శరీరం అందుకు సహకరించదని భావిస్తున్నాం. అయితే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు హార్దిక్ అవసరం ఎంతో ఉంది. అలాంటి ఆటగాళ్లకు తాజా నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

Updated On 14 Feb 2024 9:35 PM GMT
Yagnik

Yagnik

Next Story