భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

భారత్(India), ఐర్లాండ్(Ireland) మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా(Teamindia) 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185/5 స్కోర్ చేసింది. దీనికి సమాధానంగా ఐర్లాండ్ జట్టు 152 పరుగులకే ఆలౌటైంది.

ఐర్లాండ్‌ను 33 పరుగుల తేడాతో ఓడించిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా ఐర్లాండ్ జట్టు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున రితురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) అత్యధికంగా 58 పరుగులు చేశాడు. సంజూ శాంసన్(Sanju Samson) 40, రింకూ సింగ్(Rinku SIngh) 38 పరుగులు చేశారు. ఐర్లాండ్‌ తరఫున బారీ మెక్‌కార్తీ రెండు వికెట్లు తీశాడు.

బ్యాటింగ్‌లో ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ బల్బిర్నీ 72 పరుగులతో రాణించ‌డంతో మ్యాచ్‌పై ఆశ‌లు రేపాయి.. కానీ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. బాల్బిర్నీతో పాటు మార్క్ అడైర్ (23), కర్టిస్ కాంఫెర్ (18), జార్జ్ డాక్రెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. భారత్‌ తరఫున జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bumra), రవి బిష్ణోయ్(Ravi Bishnoi), ప్ర‌సిద్ద్‌ కృష్ణ(Prasiddh Krishna) చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) ఒక వికెట్ తీశాడు.

Updated On 20 Aug 2023 8:44 PM GMT
Yagnik

Yagnik

Next Story