ఆసియా కప్ 2023 మధ్యలో భారత జట్టుకు ఒక చేదు వార్త. వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబైకి తిరిగి వచ్చాడు. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండడు.

ఆసియా కప్ 2023 మధ్యలో భారత జట్టుకు ఒక చేదు వార్త. వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా(TeamIndia) ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ముంబై(Mumbai)కి తిరిగి వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రాకు బిడ్డ పుట్టడం వ‌ల‌న ముంబైకి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. నేపాల్‌(Nepal)తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ రద్దయిన నేప‌థ్యంలో నేపాల్‌తో జ‌రిగే మ్యాచ్ క‌చ్చితంగా గెల‌వాల్సివుంది.

నేపాల్‌తో మ్యాచ్‌కు ఒక రోజు ముందు జస్ప్రీత్ బుమ్రా హడావిడిగా ముంబైకి చేరుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల బుమ్రా ముంబై వెళ్లినట్లు సమాచారం. అయితే.. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. సూపర్-4 రౌండ్‌లోని మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండ‌నున్నాడు.

ఆసియా కప్ 2023లో భాగంగా రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్(India) తలపడనుంది. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం ఖాయం అని భావిస్తున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్‌(Playing Elevan)లో షమీకి చోటు దక్కలేదు. మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) లు బౌలింగ్ విభాగంలో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నారు.

టోర్నీలో సూపర్-4 రౌండ్‌కు చేరుకోవాలంటే భారత జట్టుకు నేపాల్‌పై విజయం చాలా ముఖ్యం. నేపాల్‌పై విజయం సాధిస్తే భార‌త్ సూపర్-4లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. అయితే మ్యాచ్‌కు వర్షం మ‌రోమారు అంత‌రాయం క‌లిగించ‌నుంది. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.

Updated On 3 Sep 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story