Kolkata Knight Riders vs Chennai Super Kings : రహానే ఊచకోత.. ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్ వేగానికి చిత్తైన కేకేఆర్..!
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో వేగంగా దూసుకుపోతోంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ వేగాన్ని నైట్ రైడర్స్ అందుకోలేకపోయింది. చెన్నై జట్టులో అజింక్య రహానే (71 నాటౌట్), డెవాన్ కాన్వే (56), శివమ్ దూబే (50)లు దంచి కొట్టడంతో కోల్‌కతాపై చెన్నై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐపీఎల్‌లో వేగంగా దూసుకుపోతోంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియం(Eden Gardens Stadium)లో చెన్నై ఎక్స్‌ప్రెస్ వేగాన్ని నైట్ రైడర్స్(Kolkata Knight Riders) అందుకోలేకపోయింది. చెన్నై జట్టులో అజింక్య రహానే(Ajinkya Rahane) (71 నాటౌట్), డెవాన్ కాన్వే(Devon Conway) (56), శివమ్ దూబే(Shivam Dubey) (50)లు దంచి కొట్టడంతో కోల్‌కతాపై చెన్నై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏ జట్టుకైనా అత్యధిక స్కోరు. అంతేకాదు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఓ ఐపీఎల్ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. అంతకుముందు 2019లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన ఈ మైదానంలో కోల్‌కతా 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో జాసన్ రాయ్(Jason Roy) (61), రింకు సింగ్(Rinku Singh) (53 నాటౌట్) రాణించినా గెలుపును అందించలేకపోయారు. చెన్నైకి ఇది వరుసగా మూడో విజయం కాగా.. కోల్‌కతాకు వరుసగా నాలుగో ఓటమి.
ఓపెనింగ్ జోడీ డెవాన్, రుతురాజ్(Ruthuraj Gaikwad) చెన్నైకి మరో బలమైన ఆరంభాన్ని అందించి భారీ స్కోరుకు పునాది వేశారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన గత మ్యాచ్‌లోనూ వీరిద్దరూ కలిసి 87 పరుగులు చేశారు. టీమ్ ఇండియా(Team Indai)లో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న 34 ఏళ్ల అజింక్య రహానే ఈడెన్‌లో తన సత్తాను చాటుతూ 29 బంతుల్లో 71 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే గత రంజీ సీజన్(Ranji Season)లో కూడా ముంబై తరఫున ఏడు మ్యాచ్‌ల్లో 634 పరుగులు చేశాడు. రహానెను చెన్నై సూపర్ కింగ్స్ ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. శివమ్ దూబే 21 బంతుల్లో 50 పరుగులు చేశాడు. డెవాన్ కాన్వే 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా డెవాన్ 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో మొత్తం 314 పరుగులు చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్(Home Ground). ఐనా చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ సంఖ్యలో మద్దతు ఉంటుంది. దీనికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో సగానికి పైగా ధోనీ ఏడో నంబర్ జెర్సీని ధరించిన ఫ్యాన్స్‌తో నిండిపోయింది. కోల్‌కతాతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనీ కోల్‌కతాకు అల్లుడు కూడా. అతని భార్య సాక్షి ఈ నగరానికి చెందినది కావడం విశేషం.