ఆస్ట్రేలియా ఆట‌గాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. ఆస్ట్రేలియా వ‌న్డే క‌ప్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

ఆస్ట్రేలియా ఆట‌గాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్(Jake Fraser McGurk) కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. ఆస్ట్రేలియా వ‌న్డే క‌ప్‌(Australia One Day Cup)లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా(South Australia) తరఫున ఆడుతున్న జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్(Ab de Villiers) పేరిట ఉన్న రికార్డ్ బ‌ద్ధ‌లైంది. 21 ఏళ్ల మెక్‌గర్క్ ఈ ఇన్నింగ్సులో 38 బంతుల్లో 125 పరుగులు చేసి అవుట‌య్యాడు. అత‌డి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 10 ఫోర్లు ఉండ‌టం విశేషం.అంత‌కుముందు 2015లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ 31 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ‌ద్దలుకొడుతూ 29 బంతుల్లోనే సెంచ‌రీ న‌మోదు చేశాడు.

టాస్మానియన్ బౌలర్ సామ్ రెయిన్‌బర్డ్(Rainbird) వేసిన రెండవ ఓవర్‌లో మెక్‌గర్క్ 32 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవ‌ర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. మెక్‌గుర్క్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి ట్రిపుల్-ఫిగర్స్‌కు చేరుకున్నాడు. ఇక 18 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేసిన మెక్‌గర్క్.. 50 నుంచి 100కు చేరుకోవ‌డానికి కేవ‌లం 11 బంతులు మాత్ర‌మే తీసుకున్నాడు. ఆస్ట్రేలియా త‌రుపున 50 ఓవర్ల క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ‌సెంచ‌రీ రికార్డును కూడా త‌న పేరిట న‌మోదుచేసుకున్నాడు.

Updated On 8 Oct 2023 12:16 AM GMT
Yagnik

Yagnik

Next Story