IND Vs AFG T20 Highlights : దంచికొట్టిన దూబే, యశస్వి జైస్వాల్.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ విజయం
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య శనివారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

Jaiswal, Dube blazing fifties set up India’s series-clinching win
ఇండోర్(Indore)లోని హోల్కర్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్(IND Vs AFG) జట్ల మధ్య శనివారం రెండో టీ20 మ్యాచ్(Second T20 Match) జరిగింది. భారత్(India) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం భారత్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 173 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సాధించింది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ జనవరి 17న బెంగళూరు(Bengaluru)లో జరగనుంది.
టీమ్ ఇండియా తరఫున యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal)(68 పరుగులు, 5 ఫోర్లు, 6సిక్సర్లు), శివమ్ దూబే(Shivam Dube) అర్ధ సెంచరీలు చేశారు. యశస్వి అత్యధికంగా 68 పరుగులుచేయగా.. శివమ్ దూబే 32 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 63 పరుగులు చేశాడు. 14 నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), జితేష్ శర్మ(Jithesh Sharma) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. రింకూ సింగ్ అజేయంగా తొమ్మిది పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున కరీమ్ జనత్ రెండు వికెట్లు తీశాడు. ఫజల్‌హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ తీశారు.
ఆఫ్ఘనిస్థాన్ తరఫున గుల్బాదిన్ నైబ్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 21 పరుగులు, కరీం జనత్ 20 పరుగులు చేశారు. రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ చెరో 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఒక వికెట్ తీశాడు.
