India vs Westindies 1st Test : సెంచరీలతో చెలరేగిన రోహిత్, యశస్వి జైస్వాల్.. తొలి ఇన్నింగ్సులో భారత్‌కు భారీ ఆధిక్యం
కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగడంతో డొమినికా టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మ్యాచ్‌కు రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 312 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) సెంచరీలతో చెలరేగడంతో డొమినికా టెస్టు(Dominica Test)లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మ్యాచ్‌కు రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 312 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 162 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి జైస్వాల్ 143 పరుగులతో, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు యశస్వి డబుల్ సెంచరీ(Double Century) చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
80 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, యశస్వి తొలి వికెట్‌కు భారీ బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ప్రత్యర్థిపై వికెట్ నష్టపోకుండానే టీమిండియా(Teamindia) తొలి ఇన్నింగ్స్(First Inings) ఆధిక్యం సాధించింది. భారత టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రోహిత్ శర్మ కెరీర్‌లో 10వ సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ తర్వా వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రోహిత్ 221 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. రోహిత్‌ను అలీక్ ఇథానెజ్(Alick Athanaze) అవుట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్(Shubhman Gill) ఆరు పరుగులు చేసి వారికన్ కు చిక్కాడు. శుభ్‌మన్ గిల్‌లు ఔటైన తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌కు వచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 205 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆటముగిసే సమయానికి యశస్వి 350 బంతులు ఎదుర్కొని 143 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 96 బంతుల్లో అజేయంగా 36 పరుగులతో ఉన్నాడు.
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాట్స్‌మెన్ యశస్వి. చివరిసారి శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyyer) అరంగేట్రం టెస్టులో భారత్ తరఫున సెంచరీ సాధించాడు. 2021లో కాన్పూర్(Kanpur)లో న్యూజిలాండ్(Newzealand)పై 105 పరుగులు చేశాడు. భారత్ తరఫున అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లాలా అమర్‌నాథ్(Lala Amarnath). 1933లో ఇంగ్లండ్(England)పై 118 పరుగులు చేశాడు.