పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ చివరి బంతికి ముల్తాన్ సుల్తాన్‌ను ఓడించింది. నాలుగుసార్లు ఫైనల్స్‌కు చేరిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఈ ఏడాది కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ చివరి బంతికి ముల్తాన్ సుల్తాన్‌(Multan Sultans)ను ఓడించింది. నాలుగుసార్లు ఫైనల్స్‌కు చేరిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఈ ఏడాది కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో ఆ జట్టు వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌(Final Match)ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండవసారి PSL ఛాంపియన్‌గా నిలిచింది.

టైటిల్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముల్తాన్ తరఫున ఉస్మాన్ ఖాన్ 40 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 26 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముల్తాన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌల‌ర్ల‌లో ఇమాద్‌ వాసిమ్‌ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

అనంత‌రం ఛేద‌న‌కు దిగిన‌ ఇస్లామాబాద్ జ‌ట్టులో మార్టిన్ గప్టిల్ 32 బంతుల్లో 50 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆజం ఖాన్ 22 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇది కాకుండా నసీమ్ షా 17 పరుగులు చేశాడు. హునీన్ షా చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.అయితే.. ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఇన్నింగ్స్‌ని ఆపి 19 పరుగులు చేసిన ఇమాద్ వాసిమ్ విజయం యొక్క ఎక్స్ ఫ్యాక్టర్. ఇమాద్ ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Updated On 18 March 2024 10:08 PM GMT
Yagnik

Yagnik

Next Story