ఐపీఎల్ 2024 ఫైనల్ లో ఆదివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2024 ఫైనల్ లో ఆదివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనుంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో KKR చివరిసారిగా 2014లో IPL టైటిల్‌ను కైవసం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌లో ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. కోల్‌కతా పై చేయి సాధించింది.

KKR v SRH హెడ్-టు-హెడ్- 27
కోల్‌కతా నైట్ రైడర్స్: 18
సన్‌రైజర్స్ హైదరాబాద్: 9

KKR v SRH మ్యాచ్ సమయం: మ్యాచ్ రాత్రి 7:30 PM IST (2:00 PM GMT)కి మొదలవుతుంది. మ్యాచ్‌కు అరగంట ముందు టాస్ జరుగుతుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టీవీలలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. JioCinemaలో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

Updated On 26 May 2024 1:13 AM
Yagnik

Yagnik

Next Story