IPL 2024 మినీ వేలం నేడు జ‌రుగ‌నుంది. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన చాలా మంది క్రికెటర్ల భవితవ్యం నేడు నిర్ణయించబడుతుంది.

IPL 2024 మినీ వేలం(IPL Auction 2024 )నేడు జ‌రుగ‌నుంది. భారత్‌(India)తో పాటు విదేశాలకు చెందిన చాలా మంది క్రికెటర్ల భవితవ్యం నేడు నిర్ణయించబడుతుంది. మంగళవారం దుబాయ్‌(Dubai)లో జరగనున్న వేలంలో 10 జట్లు రూ.262.95 కోట్లతో 77 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి.

10 జట్లు వేలానికి అందుబాటులో ఉన్న 333 మంది క్రికెటర్లలో.. 10 జ‌ట్ల‌లో ఖాళీగా ఉన్న‌ 77 స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నాయి. వేలంలో అంద‌రి దృష్టి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పైనే ఉంది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గుజ‌రాత్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్ల‌డంతో.. అతడి స్థానాన్ని ఎవ‌రితో భర్తీ చేయ‌నున్నార‌నే ఉత్కంఠ నెల‌కొంది. గుజ‌రాత్ వ‌ద్ద అత్య‌ధికంగా వేలంలో ఉప‌యోగించ‌డానికి రూ.38.15 కోట్లు ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జ‌ట్టులో గరిష్టంగా 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుజరాత్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ వ‌ద్ద‌ అత్యధికంగా రూ.32.7 కోట్లు మిగిలి ఉంది. లక్నో(Lucknow Super Giants) వ‌ద్ద అతి తక్కువ మొత్తం రూ. 13.2 కోట్లు మిగిలి ఉంది. అయితే ఈ మొత్తంలో వారు ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.

ఐపీఎల్ చరిత్ర(IPL History)లో తొలిసారిగా విదేశీ గడ్డపై వేలం జ‌రుగుతుంది. ఈ వేలంలో శార్దూల్ ఠాకూర్(Shardul Thakur), హర్షల్ పటేల్(Harshal Patel), మిచెల్ స్టార్క్(Mitchell Starc), పాట్ కమిన్స్(Pat Cummins), రచిన్ రవీంద్ర(Rachin Ravindra) వంటి క్యాప్డ్ క్రికెటర్లు కాకుండా యూపీకి చెందిన సమీర్ రిజ్వీ(Sameer Rizwi), మహారాష్ట్రకు చెందిన అన్ క్యాప్డ్ యువ క్రికెటర్లు ఉన్నారు. అర్షిన్ కులకర్ణి(Arshin Kulakarni), ముంబైకి చెందిన ముషీర్ ఖాన్‌(Musheer Khan)పై కాసుల‌ వర్షం కురుస్తుందని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Updated On 18 Dec 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story