రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ IPL 2025 మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి మహ్మద్ సిరాజ్‌ బంతి చేతికి తీసుకున్నప్పడు భావోద్వేగానికి లోనయినట్లు కనిపించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ IPL 2025 మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి మహ్మద్ సిరాజ్‌ బంతి చేతికి తీసుకున్నప్పడు భావోద్వేగానికి లోనయినట్లు కనిపించింది. గత ఏడేళ్లుగా ఇద్దరూ ఒకే టీంలో ఆడగా సిరాజ్‌(Siraj) ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌(GT)కి వెళ్లాడు. తొలిసారి బంతి వేయడానికి పరుగెత్తిన సిరాజ్‌ కొంత దూరం పరుగెత్తి ఆగిపోయాడు. బెంగళూరులో(RCB)కి వ్యతిరేకంగా ఆడుతున్నందున సిరాజ్ మొదటి బంతిని కోహ్లీ(Virat Kohli)కి వేయలేడని అందరూ అనుకున్నారు. మ్యాచ్ తర్వాత సిరాజ్‌ కూడడా పరోక్షంగా ఇదే విషయాన్ని అంగీకరించాడు. "నేను ఇక్కడ ఏడేళ్లు ( RCB కోసం) ఆడినందున ఇది ఉద్వేగభరితంగా ఉంది. కొంత భయము, కొంత భావోద్వేగం ఉంది, కానీ బంతిని నా చేతికి అందిన తర్వాత బౌలింగ్‌ వేయడంపైనే దృష్టిపెట్టానన్నారు. గత సీజన్ తర్వాత RCB సిరాజ్‌ను వదులుకుంది. నవంబర్‌లో జరిగిన వేలంలో గుజరాత్ ఈ భారత ఫాస్ట్ బౌలర్‌ను 1.4 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టడం, వేగం, ఖచ్చితత్వంతో బౌలింగ్ చేశాడు. జోస్ బట్లర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన సాధారణ క్యాచ్‌ను కూడా వదులుకోకపోతే మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే అతను వికెట్ పొందగలిగేవాడు. తన తదుపరి ఓవర్‌లో దేవదత్ పడిక్కల్‌ను క్లీన్ బోల్డ్‌ చేశాడు. "నేను స్థిరంగా మ్యాచ్‌లు ఆడుతున్నాను, కాబట్టి నేను చేస్తున్న తప్పులను గ్రహించలేదు. విరామ సమయంలో, నా బౌలింగ్‌పై, నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను, నేను GTలో చేరినప్పుడు, నేను అషు భాయ్ (Ashish Nehra)తో మాట్లాడాను.. బంతి ఇప్పుడు చక్కగా వస్తోంది.

ehatv

ehatv

Next Story