క్రికెట్ ప్రేమికుల(Cricket Lover) దాహార్తిని తీర్చడానికి ఐపీఎల్‌(IPL) సిద్ధమయ్యింది. ఎగ్జామ్స్‌ అయిపోయిన వాళ్లు టీవీలకు అతుక్కపోవడం ఖాయం. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారు టీవీవైపు లుక్కేయకుండా ఉండలేరు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఐపీఎల్‌-2024 సీజన్‌లోని(IPL 2024) మొదటి మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నైలోని(chennai) చెపాక్‌ స్టేడియం బిగఫైట్‌కు వేదిక కాబోతున్నది. అయిదు సార్లు టైటిల్‌ను గెల్చుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో(CSP) ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్టు తలబడనున్నాయి. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ముందు ఆరంభ వేడుకలు జరుగుతాయి.

క్రికెట్ ప్రేమికుల(Cricket Lover) దాహార్తిని తీర్చడానికి ఐపీఎల్‌(IPL) సిద్ధమయ్యింది. ఎగ్జామ్స్‌ అయిపోయిన వాళ్లు టీవీలకు అతుక్కపోవడం ఖాయం. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారు టీవీవైపు లుక్కేయకుండా ఉండలేరు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఐపీఎల్‌-2024 సీజన్‌లోని(IPL 2024) మొదటి మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నైలోని(chennai) చెపాక్‌ స్టేడియం బిగఫైట్‌కు వేదిక కాబోతున్నది. అయిదు సార్లు టైటిల్‌ను గెల్చుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో(CSP) ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్టు తలబడనున్నాయి. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ముందు ఆరంభ వేడుకలు జరుగుతాయి. సాయంత్రం ఆరున్నర గంటల నుంచే ఓపెనింగ్‌ సెర్మనీ ఉంటుంది. బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌, గాయకుడు సోనూ నిగమ్‌ ప్రేక్షకులను ఆహ్లాదపరచబోతున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు డిఫెండింగ్‌ ఛాంపియణ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. మహేంద్రసింగ్‌ ధోనీ స్వచ్ఛందంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలో వాతావరణం ప్లెజెంట్‌గా ఉంది. మ్యాచ్‌కు వాతావరణం ఎలాంటి అడ్డంకులు కలిగించదు. గురువారం రాత్రి చెన్నైలోని కొన్ని ప్రాంతాలలో చిన్నపాటి వానలు పడ్డాయి. ఈ రోజు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అంటే ఏడు గంటల నుంచి 11 గంటల మధ్యలో వాతావరణం పొడిగా ఉంటుంది. పిచ్‌ మొదట్ల బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కానీ క్రమక్రమంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఈ పిచ్‌పై టార్గెట్‌ను ఛేదించడం ఒకింత కష్టమే! అంటే మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై సూపరకింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు 31 సార్లు తలపడ్డాయ. ఇందులో 20 సార్లు చెన్నై జట్టే గెలిచింది. పది సార్లు బెంగళూరు విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చిదంబరం స్టేడియం, అదే చెపాక్‌ స్టేడియంలో రెండు జట్లు ఎనిమిది సార్లు పోటీపడ్డాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఏకంగా ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఈ విజయం కూడా లీగ్‌ ప్రారంభ ఎడిషన్‌ 2008లో లభించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు చెపాక్‌లో చెన్నైను బెంగళూరు ఓడించలేకపోయింది.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ :
రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (వికెట్‌కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహీశ్‌ తీక్షణ, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌
రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు :
విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, కెమరూన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కా​ర్తీక్‌ (వికెట్‌కీపర్‌), అనూజ్‌ రావత్‌, అల్జరీ జోసఫ్‌, సిరాజ్‌, కర్ణ్‌ శర్మ, ఆకాశ్‌దీప్‌

Updated On 22 March 2024 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story