ఐపీఎల్‌ -2023(IPL 2023) సీజన్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. పాతవి చెరిగిపోయాయి. కొన్ని మ్యాచ్‌లు చరిత్ర సృష్టించాయి. ఇప్పటికి 52 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 22 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 200 , అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాలను అవలీలవగా ఛేదించిన సందర్భాలు ఆరు ఉన్నాయి. ఇది కూడా రికార్డే.

ఐపీఎల్‌ -2023(IPL 2023) సీజన్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. పాతవి చెరిగిపోయాయి. కొన్ని మ్యాచ్‌లు చరిత్ర సృష్టించాయి. ఇప్పటికి 52 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 22 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 200 , అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాలను అవలీలవగా ఛేదించిన సందర్భాలు ఆరు ఉన్నాయి. ఇది కూడా రికార్డే. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు. మిగిలిన 22 మ్యాచ్‌లలో మరిన్ని 200 ప్లస్‌ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భారీ లక్ష్యాలను సైతం ప్రత్యర్థులు అలవోకగా దాటేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన 200 ప్లస్‌ పరుగుల లక్ష్య ఛేదనలు ఏమిటో ఓసారి చూద్దాం..

మొదటిది గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans), కోల్‌కతా నైట్‌ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరిగిన మ్యాచ్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 204 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన కేకేఆర్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 207 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో రింకూ సింగ్‌ అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 212 పరుగులు చేసింది. తరువాత బరిలో దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 213 పరుగులు చేసి గెలుపొందింది. మూడోది చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 200 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది. నాలుగో మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్, ముంబాయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబాయి జట్టు 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయిదోది పంజాబ్‌ కింగ్స్‌, ముంబాయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన ముంబాయి 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఆరోది రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) మధ్య జరిగిన మ్యాచ్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 214 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన హైదరాబాద్‌ టీమ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి ఘన విజయాన్ని సాధించింది. విజయంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్రధాన భూమికను పోషించాడు. ఈ ఆరు మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే చివరి బంతి వరకు సాగాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌ రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించింది. మరో వైపు రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals) జట్టు రెండుసార్లు 200 ప్లస్‌ స్కోర్లు సాధించి కూడా ఓడిపోయింది.

Updated On 8 May 2023 11:53 PM GMT
Ehatv

Ehatv

Next Story