IPL 2023 Points Table : టేబుల్ టాపర్‌గా లక్నో.. చివరి స్థానం ఎవరిదంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను ఓడించింది. ఈ పరాజయం తర్వాత సన్‌రైజర్స్ జట్టు నెట్ రన్ రేట్ మరింత దిగజారింది. ఒక్క విజయం కూడా లేకుండ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మరోవైపు తాము ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న లక్నో.. గుజరాత్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను ఓడించింది. ఈ పరాజయం తర్వాత సన్‌రైజర్స్ జట్టు నెట్ రన్ రేట్ మరింత దిగజారింది. ఒక్క విజయం కూడా లేకుండ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మరోవైపు తాము ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న లక్నో.. గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 5వ ర్యాంక్ నుంచి నేరుగా అగ్రస్థానానికి ఎగబాకింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (-2.867) నెట్ రన్‌రేట్ తో 10వ స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ రాజస్థాన్(Rajasthan Royals) చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో లక్నోపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గత 9 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ జట్టుకు ఇది 8వ ఓటమి. గత సీజన్‌లోనూ సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడంతో 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓడిపోయి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి జట్టు ఆటగాళ్లను, కెప్టెన్‌ను మార్చింది కానీ అదృష్టం మాత్రం ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు.
గుజరాత్, పంజాబ్ జట్లు తమ రెండు ప్రారంభ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయి.. ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి. ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓడి అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయి.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి సులువైన విజయాన్ని నమోదు చేసింది. నాలుగు ఓవర్లు ఉండగానే విజయం సాధించడంతో లక్నో నెట్ రన్‌రేట్(1.358) పెరిగింది. లక్నో గెలవడంతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) (0.700) జట్టు రెండో స్థానానికి, పంజాబ్ కింగ్స్(Punjab Kings) (0.333) మూడో స్థానానికి పడిపోయాయి.