Rohit Sharma: రోహిత్ ఫిట్నెస్ గురించి అప్డేట్ వచ్చేసింది
టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా.. జూన్ 9న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి
టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా.. జూన్ 9న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెనుదిరగడం అభిమానులకు ఆందోళన కలిగింది. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నిస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్క్ అడైర్ వేసిన ఓ బౌన్సర్ హిట్‌మ్యాన్ చేతికి తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి.. నొప్పి తగ్గకపోవడంతో రోహిత్ మైదానాన్ని వీడాడు. రోహిత్ గాయం అంత తీవ్రమైనది కాదని, అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. 97 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 36 పరుగులతో రాణించాడు. విరాట్ కోహ్లీ 1, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి అవుటయ్యారు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది.