ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ హవా కొనసాగింది.

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ హవా కొనసాగింది. టాప్‌-5లో ఏకంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్‌ శర్మ(Abhishek Sharma), 4, 5 స్థానాల్లో తిలక్‌ వర్మ(Tilak Varma), సూర్యకుమార్‌ యాదవ్‌(Surya kumar yadav) కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌(yashasvi jaiswal) 12, రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)26, సంజూ శాంసన్‌(Sanju Samson) 36, శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) 41, హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) 52, రింకూ సింగ్‌(Rinku Singh) 54, శివమ్‌దూబే(Shivam Dube) 57 స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌(Travis Head) అగ్రస్థానంలో ఉన్నాడు. పాక్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌(Babar Azam) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. శ్రీలంక ఆటగాడు పథుమ్‌ నిస్పంక (Pathum Nissanka)ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. పాక్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగిపోతున్న న్యూజిలాండ్‌ బ్యాటర్లు టిమ్‌ సీఫర్ట్‌(Tim Seifert), ఫిన్‌ అలెన్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా వృద్ధి చెందారు. సీఫర్ట్‌ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరగా.. అలెన్‌ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి ఎగబాకాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే వెస్టిండీస్‌ స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌ (Akeal Hosein)టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి(Varun Chakaravarthy) రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్‌కు టాప్‌ ప్లేస్‌లో ఉన్న అకీల్‌ హొసేన్‌కు కేవలం ఒ‍క్క పాయింట్‌ మాత్రమే తేడా ఉంది. టాప్‌-10లో వరుణ్‌ సహా ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. రవి బిష్ణోయ్‌(Ravi Bishnoi) 6, అర్షదీప్‌ సింగ్‌(Harshdeep singh) 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ehatv

ehatv

Next Story