IND Vs AUS Test Match : తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్
ఆస్ట్రేలియాపై(Australia) టాస్(Toss) గెలిచిన భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith bumrah) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆస్ట్రేలియాపై(Australia) టాస్(Toss) గెలిచిన భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith bumrah) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్ బ్యాటింగ్ లైనప్‌ను ఆసిస్(Aasis) బౌలర్లు దారుణంగా దెబ్బకొట్టారు. పెర్త్‌లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో(Test match) టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy), హర్షిత్ రాణా(Harshit rana) అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని అరంగేట్రం చేశారు. టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో సత్తా చాటుతారనుకున్న విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. తెలుగు ఆటగాడు 41 పరుగులు చేసి కాస్త పరువు కాపాడాడు. జైశ్వాల్-0, కె.ఎల్.రాహుల్-26, పడిక్కల్-0, పంత్-37, ధృవ్-11, సుందర్-4, హర్షిత్ రాణా-7, బూమ్రా-8, సిరాజ్-0 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజీల్‌వుడ్‌కు అత్యధికంగా 4 వికెట్లు దక్కాయి. భారత్ స్కోర్ 150 ఆలౌట్.