Vinesh Phogat : వినేష్‌కి రజత పతకం.. ఈ రోజే తీర్పు..!
రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఒలింపిక్ పతకం వస్తుందా లేదా అనే విషయంపై ఈ రోజు నిర్ణయం రానుంది. పారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల వెయిట్ విభాగంలో వినేష్ అధిక బరువు కారణంగా అనర్హతను ఎదుర్కొంది
రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఒలింపిక్ పతకం వస్తుందా లేదా అనే విషయంపై ఈ రోజు నిర్ణయం రానుంది. పారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల వెయిట్ విభాగంలో వినేష్ అధిక బరువు కారణంగా అనర్హతను ఎదుర్కొంది. దీనిపై వినేష్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్ట్‌లో అప్పీల్ చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. వినేష్ కేసుపై CAS తన తీర్పును ఇవ్వనుంది.
భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు సృష్టించింది. ఫైనల్ చేరడం ద్వారా దేశానికి కనీసం రజత పతకం ఖాయమైంది. అయితే.. వినేష్ బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. వినేష్ బరువు రెండు కిలోలు ఎక్కువ కావడంతో.. రాత్రంతా కష్టపడి వినేష్ బరువు తగ్గించుకుంది. అప్పటికీ 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది.
ఈ కేసుకు ఆస్ట్రేలియా న్యాయమూర్తిని నియమించారు. చార్లెస్ ఎమ్సన్, జోయెల్ మోన్లూయిస్, హబిన్ ఎస్టేల్ కిమ్ మరియు ఎస్టేల్ ఇవనోవాతో సహా నలుగురు న్యాయవాదులు వినేష్ తరపున వాదించారు. ఆ తర్వాత ఈ విషయంలో ఐఓఏ తరఫున వినేశ్ తరఫున భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే కూడా వాదించారు. ఆగస్టు 9-10 నాటికి విచారణ పూర్తయింది. ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసేలోపు ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని CAS తన వంతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిపై ఆగస్టు 13న తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు ఆ తర్వాత తెలిపింది.
ఇదిలావుంటే.. వినేష్ ఒలింపిక్ విలేజ్ నుంచి తిరిగి వచ్చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ఆమె తన లగేజీతో ఒలింపిక్ విలేజ్ నుండి బయటకు వస్తున్న ఫోటో వైరల్ అవుతోంది. ఈ రోజు CAS తీర్పు వినేష్‌కి అనుకూలంగా వస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.