IND vs GER Hockey : టీమిండియా ఓటమి.. 44 ఏళ్ల కల చెల్లాచెదురు..!
భారత్-జర్మనీ(India-Germany) పురుషుల హాకీ(Mens Hockey) జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ మూడో క్వార్టర్ వరకు టైగా సాగినప్పటికీ.. మ్యాచ్ ముగిసే ఆరు నిమిషాల ముందు జర్మనీ ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌లో గెలిచి పారిస్ ఒలింపిక్స్(paris olympics)లో ఫైనల్‌లోకి ప్రవేశించింది.
భారత్-జర్మనీ(India-Germany) పురుషుల హాకీ(Mens Hockey) జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ మూడో క్వార్టర్ వరకు టైగా సాగినప్పటికీ.. మ్యాచ్ ముగిసే ఆరు నిమిషాల ముందు జర్మనీ ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌లో గెలిచి పారిస్ ఒలింపిక్స్(paris olympics)లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలి క్వార్టర్‌లో భారత్ గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో క్వార్టర్‌లో వెనుకబడింది. అయితే మూడో క్వార్టర్‌లో సుఖ్‌జిత్ సింగ్(Sukhjith Singh) భారత్‌కు సమం చేసినప్పటికీ.. చివరి నిమిషంలో జర్మనీ గోల్ చేసి 3-2తో మ్యాచ్‌ను గెలుచుకుని స్వర్ణ పతక పోరుకు చేరువైంది. ఇక ఫైనల్‌లో జర్మనీ నెదర్లాండ్స్‌తో తలపడనుండగా.. కాంస్య పతకం కోసం భారత జట్టు స్పెయిన్‌తో తలపడనుంది.
44 ఏళ్ల తర్వాత ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని(Gold Medal) సాధించాలన్న భారత హాకీ జట్టు కలను ప్రపంచ చాంపియన్ జర్మనీ మంగళవారం చెల్లాచెదురు చేసింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన డిఫెండర్ అమిత్ రోహిదాస్(Amit Das) లేకుండానే మరిలో దిగింది.. భారత జట్టు ఒత్తిడిలో చాలా తప్పులు చేసింది. దీంతో జర్మనీ మంచి ప్రయోజనాన్ని పొందింది.
భారత్ చివరిసారిగా 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టు ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించడం కోసం కష్టపడుతూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించడం ద్వారా భారత్ కాంస్య పతకాన్ని(Bronze) గెలుచుకుంది. కానీ ఈసారి ఓడి స్వర్ణం కోసం నిరీక్షణను పొడిగించింది.