2023 ప్రపంచకప్‌కు భారత జట్టును నేడు ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ క‌మిటీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనుంది.

2023 ప్రపంచకప్‌(World Cup)కు భారత జట్టు(Teamindia)ను నేడు ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్(Chief Selector Ajith Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ క‌మిటీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనుంది. అయితే.. ఆసియా కప్ కు జ‌ట్టులో స్థానం కోల్పోయిన‌ యుజ్వేంద్ర చాహల్(Yajwendra Chahal) ప్రపంచ కప్ జట్టులో (వరల్డ్ కప్ 2023 టీమ్ ఇండియా) చోటు దక్కించుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ(Tilak Varma)పై కూడా అందరి చూపు ఉంది. ఇషాన్ కిషన్(IShan Kishan) తన స్థిరమైన ప్రదర్శనతో ప్రపంచ కప్ లో ఆడేందుకు బెర్త్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(KL Rahul) ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో అతనిపై సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారత గడ్డపై ప్రారంభం కానుంది.

Updated On 4 Sep 2023 11:56 PM GMT
Yagnik

Yagnik

Next Story