ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమిండియా సగర్వంగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

ఐసీసీ ప్రపంచకప్(World Cup) 2023లో టీమిండియా(Teamindia) సగర్వంగా సెమీఫైనల్‌(Semifinal)లోకి ప్రవేశించింది. ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్(Rohit) సేన 302 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka)ను ఓడించింది. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం. మహమ్మద్ షమీ(Mohammad Shami), సిరాజ్(Siraj) లు బంతితో విధ్వంసం సృష్టించి శ్రీలంక జట్టు మొత్తాన్ని కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేశారు.

భార‌త్ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ పేక‌మేడ‌లా కుప్పకూలింది. ఆ జట్టులోని తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు కేవ‌లం 15 పరుగులు మాత్రమే చేశారు. కేవలం ముగ్గురు శ్రీలంక బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. తద్వారా భారత్‌పై వన్డే క్రికెట్‌లో శ్రీలంక రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. టీమిండియాపై వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరుకే ఔటైన రికార్డు కూడా శ్రీలంక సొంతం. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో శ్రీలంక జట్టు 50 పరుగులకే ఆలౌటైంది.

వ‌న్డే ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bumra) నిలిచాడు. ఇప్పటి వరకు బుమ్రాకు ముందు ఏ భారత బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. నిశాంకను పెవిలియన్‌కు పంపి బుమ్రా ఈ ఘనత సాధించాడు. 2023 ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఇప్పటివరకు 15 వికెట్లు పడగొట్టాడు.

జస్ప్రీత్ బుమ్రాతో పాటు అతని భాగస్వామి మహమ్మద్ షమీ కూడా ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. శ్రీలంకపై ఐదు వికెట్లు పడగొట్టి జహీర్ ఖాన్‌ను షమీ వెనక్కి నెట్టాడు. ప్రపంచకప్‌లో షమీ ప్రస్తుతం 45 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జహీర్ మొత్తం 44 వికెట్లు తీశాడు.

Updated On 2 Nov 2023 10:22 PM GMT
Yagnik

Yagnik

Next Story