Ireland vs India : తొలి టీ20లో టీమిండియా విక్టరీ
భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

India won by 2 runs DLS Method due to rain
భారత్, ఐర్లాండ్(Ireland vs India) మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి(DLS Method)లో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏడు వికెట్లకు 139 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. దీని తర్వాత వర్షం కారణంగా గేమ్ ఆడలేక పోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఐర్లాండ్ తరఫున బ్యారీ మెక్‌కార్తీ(51) అద్భుతంగా ఆడాడు. కర్టిస్ క్యాంఫర్ కూడా 39 పరుగులు చేశాడు. వీరిద్దరూ కాకుండా పాల్ స్టెర్లింగ్(Paul Stirling), మార్క్ అడైర్ మాత్రమే పది పరుగుల మార్కును తాకగలిగారు. భారత బౌలర్లలో కృష్ణ(Prasidh Krishna), జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumra), రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌కు వికెట్ దక్కింది. భారత్ తరఫున యశస్వి(Yashaswi Jaishwal) 24, రితురాజ్ 19(నాటౌట్) పరుగులు చేశారు. తిలక్ వర్మ(Tilak Varma) డకౌటయ్యాడు. సంజు శాంసన్(Sanju Samson) ఒక పరుగు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్(Craig Young) రెండు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో తదుపరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
