వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 272 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వన్డే ప్రపంచకప్‌(Odi World Cup)లో భారత జట్టు రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 272 పరుగులు చేసింది. అనంతరం భారత్‌(India) 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 2023 ప్రపంచకప్‌లో భారత్‌ గెలుపు ప్రచారం కొనసాగుతోంది. టీమిండియా(Teamindia) తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ జ‌ట్టులో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 80 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 62 పరుగులు చేశారు.

అనంతరం భారత్‌ 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 56 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 35వ ఓవర్ చివరి బంతికి బౌండ‌రీ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. విరాట్ వన్డే కెరీర్‌లో ఇది 68వ అర్ధ సెంచరీ. అదే సమయంలో ప్ర‌పంచ‌క‌ప్‌లో అతనికి ఇది వరుసగా రెండో అర్ధ సెంచరీ. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ 85 పరుగులు చేశాడు. భారత్ తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Updated On 11 Oct 2023 10:17 PM GMT
Yagnik

Yagnik

Next Story