భారత్-వెస్టిండీస్(India vs Westindies) మధ్య జరుగుతున్న రెండవ‌ టెస్టు డ్రా(Draw) దిశ‌గా సాగుతోంది. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో 67 ఓవర్ల ఆట‌ మాత్రమే సాధ్య‌మైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం అలిక్ అతానాజ్(Alick Athanaze), జాసన్ హోల్డర్(Jason Holder) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం భారత్‌ కంటే 209 పరుగులు వెనుకబడి […]

భారత్-వెస్టిండీస్(India vs Westindies) మధ్య జరుగుతున్న రెండవ‌ టెస్టు డ్రా(Draw) దిశ‌గా సాగుతోంది. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో 67 ఓవర్ల ఆట‌ మాత్రమే సాధ్య‌మైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం అలిక్ అతానాజ్(Alick Athanaze), జాసన్ హోల్డర్(Jason Holder) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం భారత్‌ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

విండీస్ మూడో రోజు నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. వర్షం కారణంగా మధ్యాహ్న భోజనం కూడా సమయానికి అరగంట ముందే తీసుకున్నారు. దీనికి పరిహారంగా నాలుగో రోజు అంటే ఆదివారం అరగంట ముందుగానే ఆట ప్రారంభమవుతుంది. శుక్రవారం తేజ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌(33) రూపంలో వెస్టిండీస్‌కు తొలి దెబ్బ తగిలింది. తేజ్‌(Tagenarine Chanderpaul).. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌(Kraigg Brathwaite)తో కలిసి 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో రోజు 86/1 పరుగుల వ‌ద్ద విండీస్ ఆట ప్రారంభించింది. కిర్క్ మెకెంజీ(Kirk McKenzie)తో కలిసి బ్రాత్‌వైట్‌ రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మెకెంజీని అవుట్ చేయడం ద్వారా ముఖేష్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ముఖేష్‌(Mukesh)కి ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కావ‌డం విశేషం.

కెప్టెన్ బ్రైత్‌వైట్ కెరీర్‌లో 29వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత జెర్మైన్ బ్లాక్‌వుడ్‌(Jermaine Blackwood)తో కలిసి బ్రైత్‌వైట్ మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంత‌రం బ్రాత్‌వైట్ అశ్విన్(Ashwin) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్రాత్‌వైట్ 235 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 75 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత‌ జాషువా డసిల్వా(Joshua Da Silva)ను సిరాజ్(Siraj) క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం అతనాజే 37 పరుగులతో, జాసన్ హోల్డర్ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ బౌల‌ర్ల‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఇప్పటి వరకు రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌, అశ్విన్‌, ముఖేష్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

Updated On 22 July 2023 10:00 PM GMT
Yagnik

Yagnik

Next Story