IND vs SL T20 : రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరిగింది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరిగింది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది, కుశాల్ పెరీరా 54 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో శ్రీలం ఏడు వికెట్ల తేడాతో ఓడింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ జూలై 30న జరగనుంది.
శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. తొలి ఓవర్ మూడు బంతుల్లోనే మ్యాచ్ నిలిచిపోయింది. ఆ సమయంలో భారత్ స్కోరు 6/0 కాగా జైస్వాల్-శాంసన్ క్రీజులో ఉన్నారు. వర్షం ఆగిన తర్వాత అంపైర్లు ఓవర్లను కట్ చేయడంతో ఎనిమిది ఓవర్లలో 78 పరుగుల కొత్త లక్ష్యాన్ని భారత జట్టుకు నిర్దేశించారు. దీంతో టీమిండియా 6.3 ఓవర్లలో మూడు వికెట్లకు 81 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో నిసాంక(32), కుషాల్ పెరీరా(53), కామిందు మెండిస్(26) రాణించగా.. భారత బౌలర్లలో బిష్ణోయ్ మూడు, అర్ష్ దీప్ రెండు, అక్షర్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. భారత జట్టులో యశస్వి జైశ్వాల్(30), సూర్యకుమార్(26), హార్దిక్ పాండ్యా(22) పరుగులు చేయగా.శాంసన్ మరోసారి నిరాశపరిచాడు.