భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

భారత్(India)-దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఆతిథ్య సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా(Teamindia) ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌పై అభిమానులు కూడా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమైన మ్యాచ్‌కు ముందుఇరు జ‌ట్ల ప్లేయింగ్-11లో మార్పులు ఉన్నాయో చూద్దాం..

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్:

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్:

రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రెట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సన్, తబ్రైజ్.

భారత జట్టులో మార్పు ఎందుకు అవసరం.?

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0తో వెనుకంజలో ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా ర‌ద్ద‌వ‌గా, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే.

రెండవ టీ20 మ్యాచ్‌లో కోచ్(Coach), కెప్టెన్(Cptain).. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), వికెట్ కీపర్ ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan), యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(Ravi Bishnoi) ల‌ను ప‌క్క‌కు పెట్టి.. తిలక్ వర్మ(Tilak Varma), జితేష్ శర్మ(Jithesh Sharma), కుల్దీప్ యాదవ్‌(Kuldeep Yadav)లపై విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే వీరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ఆ ముగ్గురిని రంగంలోకి దింపే అవ‌కాశం ఉంది.

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డ్:

టీ20 ఫార్మాట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొత్తం 25 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆఫ్రికా జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫ‌లితం తేల‌లేదు.

Updated On 13 Dec 2023 10:35 PM GMT
Yagnik

Yagnik

Next Story