India vs South Africa : నేడు తొలి వన్డే.. జరుగుతుందా.? లేదా..?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. టీ-20 సిరీస్ సమం అవగా.. వన్డే సిరీస్ అయినా ఫలితం తేలుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్(India)-దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆదివారం జోహన్నెస్‌బర్గ్(Johannesburg) లో జరగనుంది. టీ-20 సిరీస్ సమం అవగా.. వన్డే సిరీస్(Odi Series) అయినా ఫలితం తేలుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డర్బన్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నిబంధనలతో ఓవర్లు కుదించారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వన్డేలో వర్షం మరోసారి మ్యాచ్‌ను చెడగొడుతుందా.? అనేది అభిమానులందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్(New Wanderers) మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. వాతావరణ నివేదిక ప్రకారం.. మ్యాచ్ రోజు వర్షం(Rain) పడే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు అనేది అభిమానులకు శుభవార్త. అంటే మ్యాచ్ ఉత్కంఠకు ఆటంకం కలిగించే విధంగా వర్షం ప్రభావం ఉందదనేది వాతావరణ శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది.
వాండరర్స్ మైదానం గురించి చెప్పాలంటే.. ఇక్కడ బ్యాట్స్‌మెన్(Batsman) పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు ఎక్కువగా నమోదవుతాయి. మంచి బౌన్స్ కారణంగా, బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. అయితే పిచ్ స్పిన్ బౌలర్ల(Spin Bowlers)కు కూడా ఎంతగానో సహకరిస్తుంది.
వాండరర్స్ ఇప్పటి వరకు మొత్తం 51 వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 21 మ్యాచ్‌లు గెలిచింది. ఛేజింగ్(Chaging) జట్టు 28 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మైదానంలో పరుగుల ఛేజింగ్ బెటర్. తొలి ఇన్నింగ్స్(First Inings)లో సగటు స్కోరు 240 కాగా.. రెండో ఇన్నింగ్స్(Second Inings)లో సగటు స్కోరు 204.