India vs South Africa : భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 వర్షార్పణం
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కావాల్సివుంది. అయితే.. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది.

India vs South Africa 1st T20I Tour opening game washed out
భారత్-దక్షిణాఫ్రికా(India vs South Africa) జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్(T20 Series) ఆదివారం నుంచి ప్రారంభం కావాల్సివుంది. అయితే.. డర్బన్(Durban)లోని కింగ్స్‌మీడ్ స్టేడియం(Kingsmead Stadium)లో ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ డిసెంబర్ 12న గ్కెబెర్హాలో జరగనుంది.
డర్బన్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయినట్లు ప్రకటించారు. వర్షం గ్యాప్ ఇవ్వకపోవడంతో టాస్ కూడా పడలేదు. అయితే మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్‌లన్నీ అమ్ముడుపోయాయి. దీంతో ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ డిసెంబర్ 12న గ్కెబెర్హాలో జరగనుంది. మూడో, చివరి మ్యాచ్ డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.
