ఆసియా కప్-2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. శ్రీలంక‌, పాక్ రెండు దేశాల‌లో జ‌రుగ‌నున్న ఆసియా క‌ప్ మ్యాచ్‌ల‌కు సంబంధించి పీసీబీ టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనుంది.

ఆసియా కప్-2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. శ్రీలంక‌, పాక్ రెండు దేశాల‌లో జ‌రుగ‌నున్న ఆసియా క‌ప్(Asia Cup) మ్యాచ్‌ల‌కు సంబంధించి పీసీబీ(PCB) టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనుంది. భారత్‌(India)కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకలో జరిగే భార‌త్‌ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్లు pcb.bookme.pkలో అందుబాటులో ఉంటాయి.

సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు నేటి నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మొద‌ట ద‌శ టిక్కెట్ల విక్రయం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో శ్రీలంక(Srilanka)లో జరిగే మ్యాచ్‌ల రెండో దశ టికెట్ల విక్రయాలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఒక వ్యక్తి ఒక ఐడీ-పాస్‌పోర్ట్‌పై గరిష్టంగా నాలుగు టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే.. భారత్‌-పాక్ మధ్య మ్యాచ్‌కు మాత్రం ఒక ఐడీ-పాస్‌పోర్ట్‌పై గరిష్టంగా రెండు టికెట్లు మాత్ర‌మే కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

అయితే.. పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం ఇటీవల ప్రారంభమైంది. ఆగస్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌లో 4 నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌తో సహా మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.

Updated On 16 Aug 2023 11:28 PM GMT
Yagnik

Yagnik

Next Story