World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ 'డేట్' మారుతుంది తెలుసా..?
ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన భారత్-పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఐసీసీ, బీసీసీఐతో పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది.

India vs Pakistan match now on Oct 14, as PCB agrees to the change
ప్రపంచకప్(World Cup)లో అత్యంత కీలకమైన భారత్-పాక్ మ్యాచ్(India-Pak Match)ను అక్టోబర్ 14న అహ్మదాబాద్(Ahmadabad)లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI)తో పాక్ క్రికెట్ బోర్డు(PCB) అంగీకరించింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే నవరాత్రుల తొలిరోజు కావడంతో మ్యాచ్ తేదీని ఒకరోజు ముందుకు మార్చారు. మరోవైపు పాకిస్థాన్ మరో మ్యాచ్ తేదీ మారింది. పాకిస్థాన్ జట్టు అక్టోబర్ 12న కాకుండా 10న శ్రీలంకతో తలపడనుంది. టీమిండియా(Teamindia)తో జరిగే మ్యాచ్‌కి మూడు రోజుల గ్యాప్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నవరాత్రుల కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తేదీలను మార్చాలని నిర్ణయించారు. వాస్తవానికి పండుగ సందర్భంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయి. నవరాత్రుల మొదటి రోజు భద్రతా బృందాలు బిజీగా ఉంటాయి. కాబట్టి, మ్యాచ్‌కు భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమని ఏజెన్సీలు వాదించాయి.
దీంతో.. ఐసిసి, బిసిసిఐ.. పాకిస్తాన్ రెండు గ్రూప్ మ్యాచ్‌ల తేదీ మార్పుపై పిసిబితో మాట్లాడాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)) త్వరలో దీనికి సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరికొన్ని జట్ల మ్యాచ్‌ల తేదీలు మారవచ్చు.
ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లోని 10 నగరాల్లో జరుగుతాయి. హైదరాబాద్(Hyderabad), అహ్మదాబాద్, ధర్మశాల(Dharmashala), ఢిల్లీ(Delhi), చెన్నై(Chennai), లక్నో(Lucknow), పుణె(Pune), బెంగళూరు(Bengaluru), ముంబై(Mumbai), కోల్‌కతా(Kolkata)లో మ్యాచ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో మిగతా తొమ్మిది జట్లతో పాటు అన్ని జట్లూ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడనున్నాయి. వీటిలో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గెలిచిన జట్లు ఫైనల్స్‌లో పోటీపడతాయి. గతేడాది ఇదే ఫార్మాట్‌లో ఇంగ్లండ్(England)లో ప్రపంచకప్‌ను నిర్వహించారు.
